📄 ePaper
Epaper 2
Friday, October 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరాజ్య తండాలో అంగన్వాడీల పారిశుద్ధ్య కార్యక్రమం.

రాజ్య తండాలో అంగన్వాడీల పారిశుద్ధ్య కార్యక్రమం.

📰 Generate e-Paper Clip

రాజ్య తండాలో అంగన్వాడీల పారిశుద్ధ్య కార్యక్రమం..
ప్రజావాణి,నెల్లికుదురు:మండలంలోని రాజ్యా తండాలో మంత్లీ సెక్టార్ మీటింగ్ సర్పంచ్ ధారావత్ విజయ ఆనంద్ అధ్యక్షతన ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం పై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి విజయ ఆనంద్, ఐ సి డి ఎస్ ఏ సి డి పి ఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ ఆర్.నీరజ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలు పరిసరాలు ప్రాంతాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరి చేరవని చెప్పారు. వేడి ఆహారాన్ని భుజించాలని పేర్కొన్నారు.ఆరోగ్యలక్ష్మి
పోషకాహారాన్ని సద్వినియోగం చేయాలన్నారు.

*గ్రామ బాలల పర్యవేక్షణ కమిటీ ఎంపిక..*

రాజ్య తండా సర్పంచ్ ధారావత్ విజయ ఆనంద్ అధ్యక్షతన జరిగిన సెక్టార్ మీటింగ్ లో గ్రామ బాలల పర్యవేక్షణ కమిటీ(విసిపిఏ) ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏసీడీపీవో విజయలక్ష్మి మాట్లాడుతూ సంబంధిత కమిటీ బాల్యవివాహాల నిర్మూలన, డ్రాపౌట్స్ గుర్తింపు వంటి గ్రామంలో బాలబాలికల సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో సెక్టార్ కు చెందిన వివిధ గ్రామాల అంగన్వాడీ కేంద్రాల టీచర్లు వి.జ్యోతి,ఎన్.శాంత,జె.భారతి,మంజుల, రాజ్యలక్ష్మి తదితరులగర్భిణిలు,బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.