📄 ePaper
Epaper 2
Friday, October 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదీపావళి టపాకాయల విక్రయానికి మున్సిపల్ లైసెన్స్ తప్పనిసరి

దీపావళి టపాకాయల విక్రయానికి మున్సిపల్ లైసెన్స్ తప్పనిసరి

📰 Generate e-Paper Clip

దీపావళి టపాకాయల విక్రయానికి మున్సిపల్ లైసెన్స్ తప్పనిసరి..

ఫైర్ NOC లేకుండా అనుమతి లేదు..

అనుమతి లేకుండా టపాకాయలు విక్రయిస్తే కఠిన చర్యలు..

వ్యాపారులకు జనగామ మున్సిపాలిటీ హెచ్చరిక

ప్రజల భద్రతే ముఖ్యం నిబంధనలు పాటించి టపాకాయలు విక్రయించాలని జనగామ మున్సిపాలిటీ కమీషనర్ రాజశేఖరరెడ్డి విజ్ఞప్తి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 30(ప్రజావాణి):
దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో జనగామ పట్టణంలో టపాకాయలు (Fire Crackers) విక్రయించదలచిన వ్యాపారస్తులకు జనగామ మున్సిపాలిటీ ముఖ్య గమనిక జారీ చేసింది.

జనగామ మున్సిపాలిటీ పరిధిలో దీపావళి సందర్భంగా టపాకాయలు విక్రయించదలచిన ప్రతి వ్యాపారస్తుడు తప్పనిసరిగా జనగామ మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ / విక్రయ అనుమతి పొందవలసి ఉంటుందని మున్సిపల్ కమిషనర్ రాజశేఖరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటన లో తెలియజేశారు.
ముందుగా ఫైర్ డిపార్ట్‌మెంట్ (అగ్నిమాపక శాఖ) నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం (Fire NOC) పొందాలన్నారు.
ఫైర్ నొ ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తో పాటు ఆధార్ కార్డు, ట్రేడ్ లైసెన్స్ దరఖాస్తు, విక్రయ స్థలం వివరాలు తదితర అవసరమైన పత్రాలతో జనగామ మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, మున్సిపల్ అధికారుల తనిఖీ అనంతరం అర్హులైన వారికి విక్రయ అనుమతులు జారీ చేస్తామన్నారు.

మున్సిపల్ అనుమతి పొందిన అనంతరం మాత్రమే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశించిన స్థలంలోనే టపాకాయల విక్రయాలు చేపట్టాలని
జనసాంద్రత కలిగిన ప్రాంతాలు, నివాస గృహాల మధ్య, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, పాఠశాలల సమీపంలో విక్రయాలు నిషేధంమన్నారు.
అనుమతి పొందిన షాపుల వద్ద తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలు (ఇసుక బకెట్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు) అందుబాటులో ఉంచుకోవాలని, సుప్రీంకోర్టు / ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతించిన గ్రీన్ క్రాకర్స్ మాత్రమే విక్రయించాలని,
అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టపాకాయలు విక్రయించిన వారిపై ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలతో పాటు వారి సరుకు సీజ్ చేస్తామని చెప్పారు.
ప్రజల భద్రత, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ప్రతి వ్యాపారి నిబంధనలు తప్పనిసరిగా పాటించి మున్సిపాలిటీకి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.