📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetయర్రవరం రహదారికి మహర్దశ.. రూ.7.50 కోట్లు మంజూరు

యర్రవరం రహదారికి మహర్దశ.. రూ.7.50 కోట్లు మంజూరు

📰 Generate e-Paper Clip

రహదారి అభివృద్ధికి నిధులు కేటాయించిన ఉత్తమ్ దంపతులకు యర్రవరం గ్రామస్తుల కృతజ్ఞతలు

*కోదాడ రూరల్ (యర్రవరం) అక్టోబర్ 15 : సూర్యాపేట జిల్లా రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ,యర్రవరం స్టేజీ నుంచి రామలక్ష్మీపురం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.7.50 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల యర్రవరం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్లాన్ ఎండీఆర్ నిధుల కింద మొత్తం రూ.52.50 కోట్లతో నాలుగు రహదారుల అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా యర్రవరం స్టేజీ నుంచి రామలక్ష్మీపురం వరకు పీడబ్ల్యూడీ రహదారి మార్గంలో కిలోమీటర్ 0/0 నుంచి 3/1 వరకు రహదారి అభివృద్ధికి రూ.7.50 కోట్లు కేటాయించారు.ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి యర్రవరం గ్రామం తరఫున భాషబోయిన భాస్కరరావు,గ్రామ సర్పంచ్ రావుల వెంకటేశ్వర్లు భవానితో పాటు గ్రామస్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రహదారి అభివృద్ధితో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరమవుతాయని, ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.