📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetహుజూర్నగర్ ప్రాంతంలో పేద గిరిజన లంబాడి వర్గాలపై జరుగుతున్న అన్యాయాలపై కేంద్ర, రాష్ట్ర గిరిజన కమిషన్లు...

హుజూర్నగర్ ప్రాంతంలో పేద గిరిజన లంబాడి వర్గాలపై జరుగుతున్న అన్యాయాలపై కేంద్ర, రాష్ట్ర గిరిజన కమిషన్లు స్పందించాలి.

📰 Generate e-Paper Clip

హుజూర్నగర్ ప్రాంతంలో పేద గిరిజన లంబాడి వర్గాలపై జరుగుతున్న అన్యాయాలపై కేంద్ర, రాష్ట్ర గిరిజన కమిషన్లు స్పందించాలి.

 

హుజూర్నగర్ అక్టోబర్ 11 (ప్రజావాణి)

 

హుజూర్నగర్ ప్రాంతంలో పేద గిరిజన లంబాడి వర్గాలపై జరుగుతున్న అన్యాయాలపై కేంద్ర రాష్ట్ర గిరిజన కమిషన్లు స్పందించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము అని హుజూర్నగర్ గిరిజన సంఘాల జేఏసీ నాయకులు ధరావత్ నరసింహ నాయక్ హెచ్చరించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని ఎర్రకుంట తండా తదితర తండాల గ్రామ లంబాడి ప్రజలతో లంబాడి హక్కుల పోరాట సమితి మరియు సేవాలాల్ సేన గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. హుజూర్నగర్ గిరిజన సంఘాల జేఏసీ నాయకులు ధరావత్ నరసింహ నాయక్ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో హుజూర్ నగర్ ప్రాంతంలో పేద లంబాడి కుటుంబీకులకు తీరని అన్యాయం జరిగిందని, అత్యంత సామాజికంగా వెనుకబడిన పేద లంబాడి కుటుంబీకులు చనిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు, పాలకులకు పట్టనట్లు ఉన్నదని అతను తీవ్రంగా ఆరోపించారు.

జరుగుతున్న అన్యాయాలపై కేంద్ర, రాష్ట్ర ఎస్ టి కమిషన్లో స్పందించాలని లేనిచో గిరిజన జెఏసి ఆధ్వర్యంలో జరుగుతున్న అన్యాయాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని అతను ప్రభుత్వాన్ని హెచ్చరించినారు. ఈ సమావేశంలో గ్రామ లంబాడి పెద్దలు, చిన్నలు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.