📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపెద్ద పోచారంలో ఘనంగా ఐదో రోజు బతుకమ్మ వేడుకలు

పెద్ద పోచారంలో ఘనంగా ఐదో రోజు బతుకమ్మ వేడుకలు

📰 Generate e-Paper Clip

పెద్ద పోచారంలో ఘనంగా ఐదో రోజు బతుకమ్మ వేడుకలు
గ్రామ ఆడపడుచుల కోసం స్థలాన్ని అంకితం చేసిన రామసహాయం సుధీర్‌రామ్‌రెడ్డి, ప్రమదారెడ్డి దంపతులు
కూసుమంచి అక్టోబర్ 14, ప్రజావాణి: కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామంలో ఐదో రోజు బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆడపడుచులందరూ రంగురంగుల బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
గ్రామానికి చెందిన రామసహాయం సుధీర్‌రామ్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రమదారెడ్డి దంపతులు గ్రామ ఆడపడుచులు బతుకమ్మ ఆడుకునేందుకు తమ స్థలాన్ని పెద్ద పోచారం రామాలయానికి అంకితం చేశారు. అంతేకాకుండా, తమ సొంత ఖర్చులతో ఎక్కువ మంది మహిళలు ఒకేచోట చేరి బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునేలా వృత్తాకారంలో ఫ్లోరింగ్‌ చేయించి, అందంగా పెయింటింగ్‌ వేయించారు.
గ్రామ ప్రజల సౌకర్యార్థం స్థలాన్ని అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండుగల సమయంలో గ్రామ ఆడపడుచులందరూ కలిసిమెలిసి వేడుకలు జరుపుకునేందుకు ఈ స్థలం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. సామాజిక సేవాభావంతో ముందుకొచ్చిన దంపతులను గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.