📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమేడ్చల్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మరణ మృదంగం

మేడ్చల్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మరణ మృదంగం

📰 Generate e-Paper Clip

మేడ్చల్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మరణ మృదంగం —

జవహర్ నగర్ అక్టోబర్ 17 (ప్రజావాణి ప్రతినిధి ):

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిసరాల పరిస్థితి అత్యంత ధమనీయంగా తయారైందని ఏనుగు సుదర్శన్ రెడ్డి విమర్శించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పై మీడియాలో వస్తున్న కథనాలకు స్పందించిన బిజెపి పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి శుక్రవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా కార్మిక నగర్ లో బస చేశాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంతటి ఘోరమైన వాసనను మాటల్లో వర్ణించలేనని ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. లేనియెడల బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి డంపింగ్ యార్డ్ ఎత్తివేతకై పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.