📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబిఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించిన ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు

బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించిన ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు

📰 Generate e-Paper Clip

బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించిన ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు.

ఏటూరునాగారం ఐటీడీఏ అక్టోబరు 17 (ప్రజావాణి):

ములుగు జిల్లా, మల్లంపల్లి మండలం, శ్రీనగర్ గ్రామపంచాయతీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త భూక్య దేవేందర్ తల్లి భూక్య బదిలీ అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించారు.

శ్రీనగర్ గ్రామంలోని వారి నివాసానికి చేరుకున్న ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు దివంగతురాలు భూక్య బదిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పోరిక గోవింద నాయక్, భూక్య జంపన్న, కాకులమర్రి ప్రదీప్ రావు , మల్లం పెళ్లి మండల పార్టీ అధ్యక్షులు పాలప్ శ్రీనివాస్ మాచర్ల ప్రభాకర్, సర్పంచ్ ఆకుల మల్లేశం, ఉప సర్పంచ్ వీరు నాయక్, ఆకునూరి రమేష్, తోట శ్రీను, ఆకుల రమేష్, తోట వేణు, రాజు, రాములు, గోల్కొండ రాజు, మెరుగు రాజు, మహమ్మద్ పాషా, మహమ్మద్ జానీ, అనిల్, భూక్య మురళి, గడ్డమీద భాస్కర్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.