📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణYadadri Bhuvanagiriమూత్తిరెడ్డిగూడెం బెల్ట్‌ షాపులపై చర్యలెప్పుడూ

మూత్తిరెడ్డిగూడెం బెల్ట్‌ షాపులపై చర్యలెప్పుడూ

📰 Generate e-Paper Clip

*మూత్తిరెడ్డిగూడెం బెల్ట్‌ షాపులపై చర్యలెప్పుడూ…?*

*అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు.*

*ఎంఆర్‌పీకి ధరకు మించి అధిక వసూళ్లు.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 07*

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామం లో అనధికారికంగా కొన సాగుతున్న బెల్ట్‌ షాపులపై చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు కోరు తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు కోన సాగుతున్నాయని , ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుగు తున్నాయా..? అనధికారిక కేంద్రాలకు మద్యం ఎలా చేరుతోంది..? అనే అంశాల పై ఎక్సైజ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర తనిఖీలు నిర్వహించాలని గ్రామ మహిళా మణులు డిమాండ్‌ చేస్తున్నారు.
గ్రామాల్లో మద్యం సులభంగా లభించడం వల్ల యువత పై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు పేద కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్‌ షాపుల గుర్తింపు , మద్యం సర ఫరా , అధిక ధరల వసూళ్ల పై ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి నట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.