📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబెజ్జంకి మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బొయిని ప్రశాంత్

బెజ్జంకి మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బొయిని ప్రశాంత్

📰 Generate e-Paper Clip

బెజ్జంకి మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బొయిని ప్రశాంత్

బెజ్జంకి, అక్టోబర్ 7 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గుగ్గిళ్ల గ్రామానికి చెందిన బొయిని ప్రశాంత్నియమితులయ్యారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తప్పెట శంకర్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా బొయిని ప్రశాంత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ,జిల్లా కాంగ్రెస్ నాయకులు, బెజ్జంకి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్,పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ,మాజీ మండల అధ్యక్షులు కొంకటి రాములు,ముక్కిస రత్నాకర్ రెడ్డి,కాంగ్రెస్ గుగ్గిళ్ల గ్రామ శాఖ అధ్యక్షుడు దూశెట్టి ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌తో పాటు తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.బోయిని ప్రశాంత్ మాట్లాడుతూ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ ఎస్సీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తానని,కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో బెజ్జంకి మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో గుగ్గిళ్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.