📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమాచ్నూర్‌లో భూమి ఆక్రమణపై ఫిర్యాదు.. విచారణ జరిపించాలని ఎల్లమ్మ వినతి

మాచ్నూర్‌లో భూమి ఆక్రమణపై ఫిర్యాదు.. విచారణ జరిపించాలని ఎల్లమ్మ వినతి

📰 Generate e-Paper Clip

మాచ్నూర్‌లో భూమి ఆక్రమణపై ఫిర్యాదు.. విచారణ జరిపించాలని ఎల్లమ్మ వినతి

మాచ్నూర్, అక్టోబర్ 27 (ప్రజావాణి):

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ డివిజన్ పరిధిలోని ఝరాసంగం మండలం మాచ్నూర్ గ్రామంలో తన పట్టా భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారని ఆరోపిస్తూ మునిపల్లి ఎల్లమ్మ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. తన భూమికి సంబంధించిన హక్కులను పరిరక్షించి, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె కోరారు.

తన పట్టాదారు పాస్ పుస్తకం నంబర్ T09050291318, ఖాతా నంబర్ 60496కు సంబంధించిన భూమిలో ఆక్రమణ జరిగిందని ఎల్లమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే కోర్టులో, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా, భూమి విషయంలో సంబంధిత వ్యక్తులు తమపై దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపించారు.

భూమి వివాదంపై విచారణ పూర్తయ్యే వరకు సదరు ఇళ్లకు సర్వే నిర్వహించకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నంబర్లు, ధ్రువీకరణ పత్రాలు లేదా ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు మంజూరు చేయకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి బి. రాజ్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత భూమి రికార్డులను పరిశీలించి, ఫిర్యాదుల ఆధారంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఎల్లమ్మ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.