*దళిత సంక్షేమ హామీలను అమలు చేయాలి: ఎమ్మార్పీఎస్ డిమాండ్*
నాగర్ కర్నూలు జిల్లా…
కల్వకుర్తి ప్రతినిధి (ప్రజావాణి)అక్టోబర్ 27:
నవంబర్ 1న వెల్దండ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాదిగ తెలిపారు. దళిత కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ హామీలను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.దళిత బంధు,ఎస్సీ కార్పొరేషన్,ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల ద్వారా మాదిగ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు.అసైన్డ్ భూములపై ఆధారపడి జీవిస్తున్న పేదలకు నిబంధనల ప్రకారం యాజమాన్య హక్కులు కల్పించాలని,ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అర్హులైన మాదిగ నిరుపేద కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కల్వకుర్తి నియోజకవర్గ మీడియా ఇన్చార్జి పకాడి రామాంజనేయులు, నియోజకవర్గ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు దూల రామస్వామి,ప్రధాన కార్యదర్శి ఈదులపల్లి రామకృష్ణ, కోశాధికారి ఈదులపల్లి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
