మహా చండి అవతారంలో దుర్గామాత..
ఘనంగా కుంకుమార్చన..చీరలు వితరణ
ప్రజావాణి,ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, శ్రీ మహాగణపతి మండపంలో ఏర్పాటు చేసిన దుర్గామాత తులకు బుధవారం శ్రీ చండీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు. ప్రముఖ వేద పండితులు శ్రీశ్రీశ్రీ తిరునహరి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా కుంకుమార్చన, పారాయణం, శ్రీ చక్ర అభిషేకం తదితర పూజాది క్రతవులు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ప్రతిరోజు లోకపావనికి నిర్వహిస్తున్న కుంకుమార్చన లో భాగంగా హాజరైన మహిళా భక్తులలో ఐదుగురిని డ్రా పద్ధతిన ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన వారికి ప్రతిరోజు గాయత్రి గ్రానైట్ గ్రూప్ ఆఫ్ సంస్థల యాజమాన్యం వద్దిరాజు సోదరులు ఐదు చీరలు,ఒక విలువైన వాచ్ ను గత 20 సంవత్సరాలుగా వితరణ చేస్తూ అందజేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఐదుగురి మహిళా భక్తులకు విగ్రహ దాత పబ్బోజు దాసు సమక్షంలో చీరలు వాచ్ అందజేశారు. కార్యక్రమంలో వద్దిరాజు శశిరేఖ,వద్దిరాజు దేవేందర్,వద్దిరాజు వెంకన్న పద్మ దంపతులు, మోహన్,వద్దిరాజు వెంకన్న రజిత దంపతులు భక్తులు పాల్గొన్నారు.

