మడిపల్లిలో అమ్మవారి సన్నిధిలో ఘనంగా కుంకుమార్చన పూజలు
* భక్తులకు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
జమ్మికుంట అక్టోబర్ 17 (ప్రజావాణి)
జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో శ్రీ దుర్గ భవాని అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలోని శివాలయం దగ్గర ఏర్పాటు చేసిన అమ్మవారి సన్నిధిలో శనివారం అర్చకులు రాజగోపాల్ అయ్యగారి మంత్రోచ్ఛారణల మధ్య కుంకుమార్చన పూజలు నిర్వహించగా మహిళలు పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని సిరి సంపదలు కలగాలని మహిళలు అమ్మవారిని ప్రార్థించారు. భక్తి భావంతో నిర్వహించిన కుంకుమ పూజలతో అమ్మవారి సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం భక్తుల్లో భక్తి భావాన్ని నింపింది.
7వ రోజు శనివారం అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రాజగోపాల్ అయ్యగారు,శ్రీ దుర్గ భవాని అసోసియేషన్ సభ్యులు భవాని స్వాములు,భక్తులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

