📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమంచాల బస్టాండ్‌ దుస్థితిపై ఎవరి బాధ్యత

మంచాల బస్టాండ్‌ దుస్థితిపై ఎవరి బాధ్యత

📰 Generate e-Paper Clip

*మంచాల బస్టాండ్‌ దుస్థితిపై ఎవరి బాధ్యత?*

*విద్యార్థులకు టాయిలెట్లు లేవు.. ప్రయాణికులకు కూర్చునే వసతి లేదు*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల :అక్టోబర్ 7 (ప్రజావాణి )వర్షం వస్తే అవస్థలే.. శిథిలావస్థలో లైబ్రరీ స్లాబ్‌తో స్కూల్ పిల్లలకు ప్రయాణికులకు.ప్రాణభయం

ప్రతిరోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు తిరుగుతున్నా సమస్యలు కనిపించవా?

మంచాల: మంచాల మండల కేంద్రంలోని బస్టాండ్‌ సమస్యలకు నిలయంగా మారింది. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, ప్రయాణికులు బస్టాండ్‌ను వినియోగిస్తున్నప్పటికీ కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

బస్టాండ్‌లో విద్యార్థులకు, ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా టాయిలెట్ల సౌకర్యం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ప్రయాణికులు వేచి ఉండేందుకు సరైన కూర్చునే వసతి కూడా లేకపోవడంతో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండ తీవ్రత ఉన్న సమయంలోనూ, వర్షం పడుతున్న సమయంలోనూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

వర్షం వస్తే బస్టాండ్‌ పరిసరాలు నీటితో నిండిపోవడంతో ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

అదేవిధంగా బస్టాండ్‌ సమీపంలోని లైబ్రరీ భవనం స్లాబ్‌ శిథిలావస్థకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. స్లాబ్‌ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందోనన్న భయంతో విద్యార్థులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే భవనాన్ని పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు.

బస్టాండ్‌ నుంచి ప్రతిరోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోకలు కొనసాగుతున్నప్పటికీ
ఏలాంటి. చర్యలు తీసుకోలేని ఈ ప్రభుత్వం ఎందుకు అని మండలానికి వస్తున్నటువంటి వివిధ గ్రామాల ప్రజలు. మండిపడుతున్నారు!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.