📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఘనంగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

*ఘనంగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ జన్మదిన వేడుకలు*

*నువ్వా? నేనా? అన్నట్టు రెండు గ్రూపులుగా జన్మదిన వేడుకలు*

*గూడూరు మండల కాంగ్రెస్ పార్టీలో పునరావృతమైన (బయటపడ్డ) వర్గ పోరు*

*కాంగ్రెస్ పార్టీని ఏకం చేస్తారా? గ్రూపులుగానే కొనసాగిస్తారా?*

*మళ్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మొదలైన కలవరం?*

గూడూరు మండల ప్రతినిధి:- అక్టోబర్ 06. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, మంగళవారం రోజున గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారావత్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో అదేవిధంగా, గూడూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వాంకుడోత్ సునీత కొమ్మాలు నాయక్, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్టే వెంకన్న, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భీరం శ్రీపాల్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వాంకుడోత్ కొమ్మాలు నాయక్ ల ఆధ్వర్యంలో, రెండు వర్గాలు నువ్వా? నేనా? అన్నట్లుగా మహబూబాబాద్ శాసన సభ్యుడు డాక్టర్ భూక్య మురళి నాయక్ జన్మదిన వేడుకలను, కేక్ లను కట్ చేసి ఘనంగా నిర్వహించారు. తధానంతరం రెండు వర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా స్థానిక గూడూరు మండలంలోని ప్రభుత్వ సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రంలో, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న నాయక్ సమక్షంలో రోగులకు స్వీట్ లను, బ్రెడ్ లను, పండ్ల పంపిణీల కార్యక్రమాన్ని పోటాపోటీగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ జన్మదిన వేడుకల కార్యక్రమంతో, గూడూరు మండల కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ భేదాలు నేటికీ బహిర్గతం అయ్యాయని, దీనితో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో తెలియని అయోమయం, కలవరం మొదలయ్యాయని, ఆవులు ఆవులు కొట్లాడుకుని లాగదూడల కాళ్లు విరిసేసినట్లుగా, నేటి కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు ఉన్నట్లుగా స్పష్టంగా అద్దం పడుతుందని, నేడు నిర్వహించిన ఎమ్మెల్యే జన్మదిన వేడుకలే నిలువెత్తు సాక్ష్యమని, కాంగ్రెస్ పార్టీలో ఇదే తీరు కొనసాగుతుందా? సమన్వయం చేస్తారా? వేసి చూడాల్సిందేనని అంటున్నా? రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్తలు, మేధావులు, గూడూరు మండల ప్రజలు నిర్విరామంగా చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారావత్ బాలాజీ నాయక్, నెక్కొండ మార్కెట్ వైస్ చైర్మన్ ఎడ్ల నరేష్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లికొండ మధు గౌడ్, పట్టణ అధ్యక్షుడు రాసమల్ల యాకయ్య, మండల సీనియర్ నాయకులు పూజారి శంకర్ గౌడ్, అర్రెం వీరస్వామి, గూడూరు గ్రామ ఉపసర్పంచ్ చంటి స్వామి, బొల్లేపల్లి సర్పంచ్ మహేష్, రాజనపల్లి సర్పంచ్ రవి, సీతానగరం సర్పంచ్ మంగీలాల్, చిన్నఎల్లాపురం సర్పంచ్ నీల బాలునాయక్, పొనుగోడు సర్పంచ్ మమత భాస్కర్, లైన్ తండా సర్పంచ్ మానస నరేష్, అప్పరాజపల్లి సర్పంచ్ భరత్, కొల్లాపురం సర్పంచ్ బాసు, అయోధ్యాపురం సర్పంచ్ సుహాసిని అభిరామ్ నాయక్, బొడ్డుగొండ సర్పంచ్ బండ కృష్ణ, మార్కెట్ డైరెక్టర్స్ కందిక సుమలత, సమ్మెట శ్రీనివాస్ గౌడ్, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.