📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమంచాల గ్రామంలో ఘనంగా శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు

మంచాల గ్రామంలో ఘనంగా శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

*శ్రీ శ్రీ హారిహార మాహా క్షేత్ర ప్రాంగణంలో**
*మంచాల గ్రామంలో ఘనంగా శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు*

రంగారెడ్డి జిల్లా మంచాల: అక్టోబర్ 12 (ప్రజావాణి) మంచాల గ్రామంలోని శ్రీశ్రీ హరిహర మహాక్షేత్ర ప్రాంగణంలో శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవ కమిటీ, మంచాల ఆధ్వర్యంలో ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించి, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.

దసరా నవరాత్రుల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి పూజలు, భక్తుల సందడి, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందడంతో పాటు గ్రామంలో భక్తి భావం, ఐక్యత వెల్లివిరుస్తున్నాయి.

శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు.

ఇట్లు: శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవ కమిటీ, పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.