📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసిఈసి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

సిఈసి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

📰 Generate e-Paper Clip

సిఈసి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

ఏఐసీసీ ఢిల్లీ నిరసనలో డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ నాయక్ ఫైర్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 12(ప్రజావాణి): దేశంలో ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం తెచ్చేలా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సిఈసి ) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి ధన్వంతి లక్ష్మీ నారాయణ నాయక్ డిమాండ్ చేశారు.

ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో తెలంగాణ నుండి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల బృందంతో కలిసి జనగామ జిల్లా నుండి డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ నాయక్ , వైటిడిఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ పాల్గొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుని ఈ నిరసనలో భాగమయ్యారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ నాయక్ గారు మాట్లాడుతూ.
“భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రతి పౌరుడి ఆయుధం. ఆ ఓటు హక్కును, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అత్యున్నత బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. కానీ నేడు ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను విస్మరించి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా, ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా మారి పనిచేస్తోంది. ఎన్నికల వ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకం పోయేలా చేస్తోందన్నారు.
సిఈసి జ్ఞానేష్ కుమార్ పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని. ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదులను పట్టించుకోకుండా, అధికార పార్టీ అవకతవకలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని. బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర అన్యాయం జరుగుతోందని. దీనిని తెలంగాణ కాంగ్రెస్, జనగామ జిల్లా కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ సిఈసి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు.
వైటిడిఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడుతూ.. “నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తోందని. ప్రజల ఓటుకు ఉన్న విలువను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఓటు హక్కుకు సంబంధించిన అంశాల్లో, ఓటర్ల జాబితా సవరణలో, ఎన్నికల నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండాలని. ఈవీఎంల పనితీరుపై, ఓట్ల లెక్కింపుపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది” అని అన్నారు.

“దేశంలో సామాన్య ప్రజల హక్కులు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా నాయకుడు రాహుల్ గాంధీ నిరంతరం, అలుపెరగకుండా కష్టపడుతున్నారని . కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి తరఫున పార్లమెంట్ లో, బయట ప్రశ్నిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరి గొంతు వినిపించాలనే లక్ష్యంతో ఆయన చేస్తున్న కృషి అభినందనీయం, స్ఫూర్తిదాయకం. ఆయన పోరాటంలో మేమంతా భాగస్వాములం” అని డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ పేర్కొన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఏఐసీసీ నాయకులు, తెలంగాణ నుండి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని “సిఈసి డౌన్ డౌన్, సేవ్ డెమోక్రసీ” అంటూ నినాదాలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.