📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమంచాలలో గొర్రెల కాపరిపై దాడి.. గొర్రెల ఎత్తుకెళ్లేందుకు యత్నం

మంచాలలో గొర్రెల కాపరిపై దాడి.. గొర్రెల ఎత్తుకెళ్లేందుకు యత్నం

📰 Generate e-Paper Clip

*మంచాలలో గొర్రెల కాపరిపై దాడి.. గొర్రెల ఎత్తుకెళ్లేందుకు యత్నం!*

*రెండుసార్లు ఆవ యాదయ్య పై దాడి జరిగినా నిందితులు చిక్కరా?*

*గ్రామాల్లో పనిచేయని సీసీ కెమెరాలతో భద్రతపై ఆందోళన*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 28 (ప్రజావాణి)మంచాల: మంచాల గ్రామంలో గొర్రెల కాపరులపై దాడులు, గొర్రెల దొంగతనాల యత్నాలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. గొర్రెల మందలను కాపాడుకుంటూ జీవనం సాగించే కాపరులకు భద్రత కరువవుతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది. గొర్రెల కాపరిపై ఇప్పటికే రెండుసార్లు దాడి జరిగినట్లు, ఈ ఘటనలకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ నిందితులను పట్టుకోవడంలో పురోగతి లేకపోవడంపై బాధితులు, స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

సీసీ కెమెరాలు పనిచేయకపోతే భద్రత ఎలా?

గ్రామాల్లో నేరాలను అరికట్టేందుకు, దొంగలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు ఉపయోగపడాల్సిన కెమెరాలు పనిచేయకపోతే వాటిని ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కెమెరాల నిర్వహణ, మరమ్మతులు, నిరంతర పర్యవేక్షణపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.

“ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం” అనే మాట నేరాల నియంత్రణలో కెమెరాల ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. అలాంటప్పుడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? అవి పనిచేస్తున్నాయా? పనిచేయకపోతే వాటిని బాగు చేయాల్సిన బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

గొర్రెల కాపరి పరిస్థితి ఏమిటి?

రాత్రింబవళ్లు గొర్రెలను కాపాడుకుంటూ జీవనం సాగించే గొర్రెల కాపరులపై దాడులు జరిగితే వారి పరిస్థితి ఏమిటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొర్రెల కాపారి పై దాడి చేసినటువంటి వారిని పోలీసులు పట్టుకొని శిక్షించాలని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.