ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షునికి సన్మానం..
ప్రజావాణి,నెల్లికుదురు: ఎమ్మార్పీఎస్ నెల్లికుదురు మండల అధ్యక్షులు తూల్ల వెంకన్నను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసం రంజిత్ రెడ్డి తో పాటు పలువురు నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలో వెంకన్నను కలిసి వారు శుభాభినందనలు తెలిపి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షునిగా వరుసగా నాలుగు మార్లు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రావుల సతీష్,మాజీ వైస్ ఎంపీపీ జల్ల వెంకటేష్, ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తుళ్ల చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

