*పసరలో G+ నిర్మాణాలపై అనుమానాలు.. 29/A పర్మిషన్ ఉందా?*
.పసరలో అక్రమ కట్టడాల కోట.. అధికారులకు కనబడట్లేదా?
.కళ్లు మూసిన పంచాయతీ.. పసరలో పుట్టుకొస్తున్న అక్రమ భవనాలు.
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
గోవిందరావుపేట మండలం పసర గ్రామంలో G+ నిర్మాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధాన రహదారి వెంట పలు భవనాలు G+ విధానంలో నిర్మాణం జరుగుతున్నాయి.
అయితే వాటికి సరైన పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ముఖ్యంగా 29/A నెంబర్ లో జరుగుతున్న నిర్మాణంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేక అక్రమంగా నిర్మిస్తున్నారా అని చర్చ నడుస్తోంది.
పసర గ్రామం రోజురోజుకు అభివృద్ధి చెందుతుండటంతో నిర్మాణాలు జోరందుకున్నాయి.
కొందరు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా భవనాలు కడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
G+ పర్మిషన్ లేకుండా నిర్మిస్తే భవిష్యత్తులో కూల్చివేతలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.
MPDO, DTPC అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాలను అడ్డుకోకపోతే గ్రామంలో ఇదే తరహా నిర్మాణాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పర్మిషన్ లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారులు స్పందించి వాస్తవాలు వెల్లడించాల్సి ఉంది.

