📄 ePaper
Epaper 2
Friday, October 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణభళా.!శ్రీరామగిరి సర్పంచి

భళా.!శ్రీరామగిరి సర్పంచి

📰 Generate e-Paper Clip

భళా.!శ్రీరామగిరి సర్పంచి..
చెరువు నీటి వృధాను అరికట్టిన ప్రశాంత్..
గ్రామస్తులతో కలిసి మత్తడి రంద్రాలు పూడ్చివేత
సర్పంచి ముందు చూపు పట్ల గ్రామస్తుల ప్రశంసలు
ప్రజావాణి,నెల్లికుదురు: ఓవైపుఎల్ నినో ప్రభావం తో వర్షాభావ పరిస్థితుల తో నీటి కరువు ముంచుకొస్తోంది.గతంలో కురిసిన వర్షాలకు చెరువులో చేరిన నీరు వృధా కానివ్వొద్దనుకున్నాడు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీ రామగిరి సర్పంచ్ మాద రి ప్రశాంత్. అనుకున్న దే తడవుగా చెరువును సందర్శించి మత్తడి రంద్రాల ద్వారా నీరు వృధాగా పోతున్నట్లు గుర్తించాడు.వెంటనే గ్రామస్తులతో కలిసి గురువారం చెరువు మత్తడి వద్దకు వెళ్లి స్వయంగా చెరువులోకి దిగిన సర్పంచి రంద్రాలను పూడ్చివేతకు ఉపక్రమించాడు. అవసరమైన చోట పెద్ద రంద్రాలను జెసిబి యంత్రాన్ని ఉపయోగించి పూడ్చివేశారు.

*సర్పంచి ముందుచూపుతో వృధాకు అడ్డుకట్ట*

గ్రామ ప్రజలు,రైతులు,పశువులు,పక్షుల శ్రేయస్సు కోసం రాబోయే నీటి కష్టాల నుంచి కొంతవరకైనా రక్షించుకోవాలనే ఆలోచనతో సర్పంచ్ మాదరి ప్రశాంత్ చెరువు నీటి వృధా పై దృష్టి సారించారు.ఉపసర్పంచి రామగిరి సుమన్, వార్డు సభ్యులు గ్రామస్తులతో కలిసి నీటి వృధాను ఎంతో కష్టపడి నిలిపివేశారు.

*నీటిని కాపాడుకోవడం అందరి బాధ్యత..*

నీటిని పొదుపుగా వాడుకొని కాపాడుకోవడం అందరి బాధ్యత అని సర్పంచ్ ప్రశాంత్ అన్నారు. చెరువులో నీరు ఉంటే భూగర్భ జలాలు పడిపోకుండా ఉంటాయని దీంతో ప్రజలకు, రైతులకు,పశువులకు,పక్షులకు నీటి కొరత నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. నీరు లేకుంటే ప్రాణులకు మనుగడ లేదని, ఈసారి ఎల్ నినో తో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండటంతో ఎక్కడికక్కడ నీటి వృధాను అరికడుతూ నీరును పొదుపుగా వాడుకోవాలని, ప్రతి ఒక్కరూ ఈ సమస్యపై దృష్టి సాధించి సహకరించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.