ఓటు నమోదును బాధ్యతగా తీసుకోవాలి
– మాజీమంత్రి సత్యవతి రాథోడ్
ప్రజావాణి,నెల్లికుదురు: పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకోవాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ శ్రేణులకు, బాధ్యులకు సూచించారు.మండల కేంద్రం నెల్లికుదురు లోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తో కలిసి గురువారం ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సత్యవతి మాట్లాడారు.
రాబోవు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైనదని ఆమె అన్నారు. పట్టభద్రుల ఓట్ల నమోదును వేగవంతం చేయాలని అవసరమైతే కార్యకర్తలు వారికి అవగాహన కల్పించి ఓటు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చేనెల 6తో ఓటు నమోదు గడువు ముగియనున్న దృష్ట్యా నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు శక్తివంచన లేకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి శ్రీనివాస్, పులి రామచంద్రు, భానోత్ భీముడు, బత్తిని అనిల్ గౌడ్, గొట్టిముక్కుల ఆదిరెడ్డి, వరిపెల్లి వెంకటేష్,తూళ్ళ వివేక్, వంగాల ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

