మినగలవీడు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
రిటైర్డ్ ఐఏఎస్ ను కలిసిన సర్పంచి చైతన్య నాగరాజు
ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తూ భాగస్వాములు కావాలని ఆ గ్రామ సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు సీనియర్ ఐఏఎస్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు బియ్యాల వెంకట పాపారావును కోరారు. మడికొండ రాంపూర్ లోని ఆయన నివాసంలో సర్పంచి చైతన్య నాగరాజు గురువారం బైసా రాజేష్,నాగవెల్లి బాలరాజు లతో కలిసి పాపారావును,బియ్యాల దయాకర్ రావు,బియ్యాల దేవేందర్ రావు,కోమండ్ల సోమేశ్వరరావు లను కలిశారు. ఈ సందర్భంగా సర్పంచి చైతన్య నాగరాజు మాట్లాడుతూ గ్రామ సమస్యలను వివరించి గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించాలని కోరినట్లు తెలిపారు.
