📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriబోడుప్పల్‌లో ఘనంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు.....జై భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడో వార్షికోత్సవ...

బోడుప్పల్‌లో ఘనంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు…..జై భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడో వార్షికోత్సవ మహోత్సవాలు

📰 Generate e-Paper Clip

అక్టోబర్ 20 (ప్రజా వాణి): బోడుప్పల్‌లోని న్యూ అంబేద్కర్ నగర్‌లో జై భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు–2026, మూడో వార్షికోత్సవ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో పాటు మేడ్చల్ రూరల్ జిల్లా ఎండోమెంట్ సెల్ కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోనె శ్రీనివాస్, రాష్ట్ర ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్ ఫణిభూషన్, సీనియర్ నాయకుడు వేమునూరు మురళి, ఎండోమెంట్ సెల్ కన్వీనర్ ఆదిమూలం కరుణాకర్, సెక్రటరీ పద్మ మహేశ్వర్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాయబారపు వేణుగోపాల్, కో-కన్వీనర్ నవ్య రెడ్డి, అశోక్ పాల్గొన్నారు.

అలాగే అసెంబ్లీ కో-కన్వీనర్లు భువనేశ్వరి, విశ్వేశ్వర్ రావు, డివిజన్ కన్వీనర్లు సాయి కృష్ణ, ఎం. సంజీవన్న, అశోక్, డివిజన్ కో-కన్వీనర్లు ప్రభాకర్, ఎం. మల్లేష్, వీరస్వామి, పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థి ఆదిమూలం రమాదేవి, డివిజన్ కార్యదర్శి ఆర్. రోజా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు జై భజరంగ్ యూత్ అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.