మందుబాబుల దోపిడీకి కేంద్రంగా తిరుమల వైన్స్.. పండుగైతే పండగే, ఇష్టానుసారంగా ధరల వసూలు.
ఒక్కోరోజు ఒక్కో రేటు..
స్థానికులకు దక్కని సీసాలు,అధిక రేట్లకు బెల్టు షాపులకు రవాణా. కోయగూడ ఎల్లపూర్ వైన్స్ నిర్వాకంపై మందుబాబుల ఆగ్రహం.
ఏటూరునాగారం అక్టోబరు 21 ప్రజావాణి:
మద్యం ప్రియుల బలమే వనరుగా మారుతోంది.. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ, పండుగలు వస్తే చాలు ఇష్టానుసారంగా ధరలు పెంచేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు కొందరు వైన్స్ నిర్వాకులు. తాజాగా కోయగూడ ఎల్లపూర్ పరిధిలోని ‘తిరుమల వైన్స్’ కేంద్రంగా సాగుతున్న అక్రమ దందాలపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఈ వైన్స్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక్కోరోజు ఒక్కో రేటు.. పండుగైతే బాదుడే బాదుడు!
సాధారణ రోజుల్లోనే ఎమ్మార్పీ ఏం ఆర్ పి ధరలకు మించి అదనంగా వసూలు చేస్తున్న తిరుమల వైన్స్ నిర్వాకులు, పండుగలు, ప్రత్యేక రోజులు వస్తే మాత్రం ధరలను అమాంతం పెంచేస్తున్నారు. ఒక రోజు కొన్న బ్రాండ్ మరుసటి రోజుకు వేరే రేటుకు అమ్ముతూ మందుబాబులను నిలువునా దోచుకుంటున్నారు. ప్రశ్నిస్తే ఇష్టమైతే కొనుక్కోండి అంటూ వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బెల్టు షాపులకు లక్షల్లో అక్రమ రవాణా
నిబంధనల ప్రకారం వైన్స్ నుంచి నిర్దేశిత పరిమితి మించి మద్యం తరలించడానికి కానీ, ఇక్కడ మాత్రం ఆటోలు,కార్లు, ద్విచక్ర వాహనాలపై (బైక్‌లపై) లక్షలాది రూపాయల విలువైన మద్యం సీసాలను బెల్టు షాపులకు తరలిస్తున్నారు. వైన్స్ ఎదుట సాధారణ ప్రజలు, స్థానికులు లైన్లో నిలబడితే మందు దొరకని పరిస్థితి నెలకొనగా, తెరవెనుక మాత్రం బల్క్ ఆర్డర్లు తీసుకుంటూ బెల్టు షాపులకు గుట్టుచప్పుడు కాకుండా సరుకును చేరవేస్తున్నారు.
మందుబాబులు, స్థానికుల ఆగ్రహంనియంత్రణ లేని ఈ అక్రమ అమ్మకాలపై మందుబాబులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండదండలు ఉండబట్టే వైన్స్ నిర్వాకులు ఇంతటి దుస్సాహసానికి పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి, తిరుమల వైన్స్‌పై తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

