బోడుప్పల్లో ఘనంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు…..జై భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడో వార్షికోత్సవ మహోత్సవాలు
అక్టోబర్ 20 (ప్రజా వాణి): బోడుప్పల్‌లోని న్యూ అంబేద్కర్ నగర్లో జై భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు–2026, మూడో వార్షికోత్సవ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో పాటు మేడ్చల్ రూరల్ జిల్లా ఎండోమెంట్ సెల్ కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోనె శ్రీనివాస్, రాష్ట్ర ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్ ఫణిభూషన్,...