📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయం

పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయం

📰 Generate e-Paper Clip

పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయం

* శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
* జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*

సమాజంలో శాంతి, సామరస్యం నెలకొల్పడంతో పాటు ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించడంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని, పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలకు కమీషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం పోలీసులు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ, అవసరమైన సందర్భాలలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారని, పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. దేశ సరిహద్దుల పరిరక్షణలో సైన్యం, నావికాదళం, వైమానిక దళం కీలక పాత్ర పోషిస్తుండగా, దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతను పోలీసులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. సమాజంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, ప్రజలకు రక్షణ కల్పించడం, శాంతి భద్రతలను కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యతలని తెలిపారు. రాష్ట్రంలో, దేశంలో శాంతి సామరస్యాలు నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, పోలీసు శాఖ నిరంతర కృషి, అంకితభావం వల్ల ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించగలుగుతున్నారని తెలిపారు. పోలీసు విధులు సవాళ్లతో కూడుకున్నవని, ప్రజల రక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. ప్రజలు తమ బాధ్యతను గుర్తించి చట్టాలను, నిబంధనలను పాటించాలని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. సామాజిక బాధ్యత, పౌర స్పృహతో నిబంధనలు పాటించడం ద్వారా సమాజంలో సమస్యలను తగ్గించి, మెరుగైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. పోలీసు శాఖకు ప్రజలు సహకరించడం ద్వారా శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని, తద్వారా అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న భారత సరిహద్దు గస్తీ విధులలో ఉన్న సిఆర్‌పిఎఫ్ బృందంపై శత్రు బలగాలు ఆకస్మిక దాడి చేయగా, మన జవాన్లు వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారని, ఆ చారిత్రక ఘటన స్ఫూర్తితోనే దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఈ రోజున పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అమరవీరుల స్మారకంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఉన్నత ఆశయం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అంకితభావంతో పని చేస్తారని, ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతీ పోలీస్, సైనిక జవాను త్యాగం వెలకట్టలేనిదని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం, ప్రజల ప్రాణ, ఆస్తులకు రక్షణ కల్పించడమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు. విధులలో ఉండే సిబ్బంది అంతా పూర్తి మనస్ఫూర్తిగా, అంకితభావంతో పని చేస్తూ పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని మరింత పెంపొందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.