📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKamareddyబీర్కూర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

బీర్కూర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

📰 Generate e-Paper Clip

బీర్కూర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి

బీర్కూర్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ దేశ స్వాతంత్య్రం కోసం చేసిన సేవలను, సత్యం, అహింస, శాంతి సిద్ధాంతాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలు సమాజానికి నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సోదరభావం, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధర్మతేజతో పాటు ఉప సర్పంచ్ పరమేష్, వార్డు సభ్యులు, మాజీ ఎంపీపీ రఘు, బసవరాజ్ పటేల్,కార్యదర్శి గంగారాం, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.