📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతెలంగాణ రాష్ట్ర టైర్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర టైర్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

📰 Generate e-Paper Clip

*తెలంగాణ రాష్ట్ర టైర్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక*

అందోల్-జోగిపేట అక్టోబర్ 02 మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర టైర్ వర్క్ పంచర్ షాప్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని జోగిపేట పట్టణంలోని ముదిరాజ్ భవన్‌లో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. జోగిపేట టైర్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పుగండ్ల రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాకూబ్, ప్రధాన కార్యదర్శి కందగండ్ల నగేష్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా టైర్ పంచర్ షాప్ వర్కర్స్ సమస్యలు, సంక్షేమం కోసం పలు డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. టైర్ పంచర్ వర్కర్స్‌కు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని, హెల్త్ కార్డులు అందించాలని, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
అలాగే టైర్ పంచర్ వర్కర్స్‌కు ప్రత్యేక సబ్సిడీ రుణాలు అందించాలని, అసోసియేషన్ సభ్యులకు ప్రభుత్వంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పంచర్ షాప్ నిర్వహిస్తున్న నిరుపేద కార్మికులను ప్రభుత్వం గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని, వారి పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆందోల్–జోగిపేట పంచర్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇర్షత్ హుస్సేన్, ఉపాధ్యక్షుడు షేక్ ఆమెర్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రిజ్వాన్, క్యాషియర్ ఇబ్రహీం, కార్యవర్గ సభ్యులు నయీమ్, అబ్బు సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఇతర జిల్లాల టైర్ పంచర్ షాప్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.