📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబాపూజీ అడుగుజాడల్లో కాంగ్రెస్ ప్రభుత్వం

బాపూజీ అడుగుజాడల్లో కాంగ్రెస్ ప్రభుత్వం

📰 Generate e-Paper Clip

బాపూజీ అడుగుజాడల్లో కాంగ్రెస్ ప్రభుత్వం..
కాంగ్రెస్ మండల అధ్యక్షులు అశోక్ గౌడ్
ప్రజావాణి,ఇనుగుర్తి: జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం నిరంతరం కృషి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ అన్నారు. గాంధీ జయంతి పురస్కరించుకొని మండలంలోని చిన్ననాగారం యుపిఎస్ ఆవరణంలోని గాంధీ విగ్రహానికి సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య ప్రభృతులతో కలిసి కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ ఆశయాలను నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రజలకు కూడు,గూడు అందించడానికి సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్ల తో పాటు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు ముత్యాల సోమక్క, చెడుపాక అలివేలు వెంకన్న,నిడిగంటి చంద్రమౌళి, గుండాల మంగమ్మ ధర్మయ్య,నాయకులు నాయిని కొమరయ్య,దాసరి ప్రకాష్,కొయ్యడి యాకాంతం,బైరు శ్రీనివాస్,పోలోజు విశ్వచారి, బైరు వెంకన్న,బైరు శ్రీరాములు,బైరు వేణు చెడుపాక శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.