📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

📰 Generate e-Paper Clip

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
నరసింహులపేట పోలీస్ స్టేషన్‌లో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట: దేశ రక్షణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎస్‌ఐ బానోత్ వెంకన్న అన్నారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నరసింహులపేట మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బంది సేవలను స్మరించుకున్నారు.
ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి సేవలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలోఎస్ఐ బాణోత్ వెంకన్న సర్పంచ్
పెదమాముల యకయ్య, ఉపసర్పంచ్ కాస యాకయ్య, కాంగ్రెస్ పార్టీ, నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వార్డు మెంబర్లు,పోలీసు సిబ్బంది, గ్రామ ప్రముఖులు, పలువురు స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.