📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamపేద దర్జీలపై అక్రమాల సవారి....?

పేద దర్జీలపై అక్రమాల సవారి….?

📰 Generate e-Paper Clip

పేద దర్జీలపై అక్రమాల సవారి….?


*188 మందికి పట్టాలు ఉన్న ప్రయోజనం లేకపాయే…?


*అక్రమార్కుల “గుప్పెట్లో’ బందీగా మారిన ఆరు ఎకరాల భూమి…?



*పట్టాలిచ్చారు… సర్వేలు చేశారు.. కానీ పేదలకు ఒరిగింది ఏంటో…?

*ఖమ్మం 17వ డివిజన్లో రాజ్యమేలుతున్న అక్రమాలు…!


దిక్కు తోచని స్థితిలో పేదలు…?

ఉమ్మడి రాష్ట్రంలో పురుడు పోసుకున్న అక్రమాలు…

తెలంగాణలోనూ… కొనసాగుతున్నాయా…?

సమగ్ర సర్వే తో పేదలకు న్యాయం …?

మన ప్రజావాణి ప్రత్యేక కథనం…1



ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి


ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం నగరంలోని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన దర్జీ వృత్తిని చేసే (టైలరింగ్ పనులు) సంక్షేమానికి ఆనాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టి సొంత ఇల్లు లేని వారికి తలదాచుకోవడానికి ప్రతిష్టాత్మకంగా ఆనాటి ప్రభుత్వంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు చేతుల మీదుగా 188 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థల పటాలు అందించారు. ఈ ఇళ్ల స్థలాల లో శాశ్వత నిర్మాణాల కోసం ఆనాటి ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసిందని తెలిసింది. కాగా కొందరు అక్రమార్కులు నకిలీ పట్టాలు సృష్టించి ఇండ్లను ఇండ్ల స్థలాలలో నిర్మాణం చేసిన బేస్ మట్టాలను అక్రమార్కులు దౌర్జన్యంగా అర్ధరాత్రి వేళ కూల్చివేసినట్లు శ్రీనివాస్ నగర్ 17వ వార్డు డివిజన్ బాధితులు ఆరోపిస్తున్నారు. మన ప్రజావాణి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రతినిధి సేకరించిన సమాచారం మేరకు ఖమ్మం జిల్లా ఖమ్మం నగరం అర్బన్ మండలం శ్రీనివాస్ నగర్ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్లు 303,304 నందు 1999 2000 2001 సంవత్సరాలలో దశలవారీగా ఇండ్ల స్థలాలను పంపిణీ చేసినట్లు బాధితులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఆర్ఎంపి వైద్యుడు స్థానికంగా రాజకీయ అండదండలతో నకిలీ పట్టాలు సృష్టించి అర్ధరాత్రి వేళలో సుమారు 30 బేస్ మట్టాలు 40 ఇళ్ళను దౌర్జన్యంగా కూల్చివేసినట్లు బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అనంతరం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి న్యాయం చేయమని వేడుకున్నట్లు ఆ మేరకు పేదలకు చెందిన పట్టాలు చెల్లుతాయని ఎటువంటి అభ్యంతరాలు లేవని ధృవీకరిస్తూ సాక్షాత్తు రెవెన్యూ శాఖ అంగీకరిస్తూ స్థానిక ఖమ్మం అర్బన్ తాహ సిల్దార్ నివేదిక సమర్పించి స్థానిక పోలీసులకు లేఖ రాసినట్లు బాధితులు తెలిపారు. కాగా ఒక్కొక్క ప్లాటు 100 గజాలు చొప్పున నాటి రెవెన్యూ అధికారులు అధికారిక పట్టాలు అందించటం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలో పురుడు పోసుకున్న అక్రమాలు ప్రజా ప్రభుత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో కొనసాగటం పట్ల ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు ఖమ్మం కార్పొరేషన్ జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులు స్పందించి సమగ్ర భూ సర్వే నిర్వహించి నాటి ఆదేశాల ప్రకారం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకొని సుమారు 6 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు శాశ్వత నివాస గృహాలు మంజూరు చేసి ఆదుకోవాలని శ్రీనివాస్ నగర్ దర్జీ బాధితులు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.


*అక్రమార్కులు… వెంచర్ నిర్వాహకులే కీలక సూత్రధారులా…? పేదల భూములపై బడా బాబుల చూపు…? మరికొన్ని సమగ్ర వివరాలతో… ఆధారాలతో.. రేపటి కథనం 2లో వేచి చూడండి…!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.