పోచారంలో మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు
బొడ్రాయి వద్ద కేక్ కట్ చేసి.. రక్తదాన శిబిరానికి తరలిన యువకులు
కూసుమంచి, ప్రజావాణి:
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను గ్రామ పెద్దలు, యువకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని బొడ్రాయి వద్ద పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్థుల సమక్షంలో కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం యువకులు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ కూసుమంచి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి బయలుదేరారు. మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరంలో పాల్గొనేందుకు యువకులు ముందుకు రావడం విశేషం.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామసాయం వెంకట్ రెడ్డి, రామసాయం బాలకృష్ణారెడ్డి, ఇందుర్తి వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ సలవాది గురుమూర్తి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

