పెద్ద పోచారంలో ఘనంగా ఐదో రోజు బతుకమ్మ వేడుకలు

పెద్ద పోచారంలో ఘనంగా ఐదో రోజు బతుకమ్మ వేడుకలు గ్రామ ఆడపడుచుల కోసం స్థలాన్ని అంకితం చేసిన రామసహాయం సుధీర్‌రామ్‌రెడ్డి, ప్రమదారెడ్డి దంపతులు కూసుమంచి అక్టోబర్ 14, ప్రజావాణి: కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామంలో ఐదో రోజు బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆడపడుచులందరూ రంగురంగుల బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన రామసహాయం సుధీర్‌రామ్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రమదారెడ్డి దంపతులు గ్రామ ఆడపడుచులు బతుకమ్మ ఆడుకునేందుకు తమ స్థలాన్ని...