📄 ePaper
Epaper 2
Thursday, October 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపెండింగ్ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

పెండింగ్ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

పెండింగ్ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ విజయ సునీత

ప్రజావాణి దినపత్రిక మార్కాపురం జిల్లా ప్రతినిధి

మార్కాపురం(అక్టోబర్7):వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస లే అవుట్లలో మిగిలిపోయిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.బుధవారం మార్కాపురం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులతో కలిసి పునరావాస లే అవుట్లలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పునరావాస కాలనీల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ వంటి ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పెండింగ్ పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.అదే విధంగా పునరావాస లే అవుట్లలో దేవాలయాలు, చర్చి, ఈద్గా, అంగన్వాడీ కేంద్రాలు, వెటర్నరీ ఆసుపత్రులు వంటి సామాజిక అవసరాలకు సంబంధించిన నిర్మాణ పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని తెలిపారు. ఆయా పనులకు అవసరమైన అనుమతులు, అంచనాలు, ఇతర ప్రక్రియలను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఇంకా నిర్మించాల్సి ఉన్న పాఠశాలలకు సంబంధించి వెంటనే అంచనాలు సిద్ధం చేసి తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పునరావాస కాలనీల్లో నివసిస్తున్న ప్రజల అవసరాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.పునరావాస కాలనీల అభివృద్ధి పనులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ, పనుల్లో జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో వెలిగొండ ప్రాజెక్టు ఎస్‌ఈ అబు తాలిం, కనిగిరి ఆర్డీవో అజయ్ కుమార్, వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.