📄 ePaper
Epaper 2
Thursday, October 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసిఈసి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

సిఈసి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

📰 Generate e-Paper Clip

*సిఈసి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి*

*రాష్ట్ర కార్మిక మైనింగ్ ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి*

*కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో మహా ధర్నా*

* *మన ప్రజావాణి*, మందమర్రి:-

ఓట్ల తొలగింపులో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) చీఫ్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. సిఈసి చీఫ్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం తోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టుకు నిరసనగా గురువారం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళనలు చేపట్టగా, పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నా, నిరసన కార్యక్రమానికి మంత్రి వివేక్ హాజరయ్యారు. ఈసందర్భంగా నిరసన కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల ఓటు హక్కును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రజల ఓటు హక్కును దెబ్బతీసే ఎలాంటి చర్యలను సహించేది లేదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, పట్టణ కాంగ్రెస్ కమిటీ నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మైనారిటీ విభాగం, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.