📄 ePaper
Epaper 2
Thursday, October 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపుట్టపహాడ్‌లో వివాదాస్పద భూమి

పుట్టపహాడ్‌లో వివాదాస్పద భూమి

📰 Generate e-Paper Clip

పుట్టపహాడ్‌లో వివాదాస్పద భూమి: క్రయవిక్రయాలు చేస్తే కఠిన చర్యలు – హెచ్చరిక
పరిగి, అక్టోబర్ 08( ప్రజావాణి)
వికారాబాద్ జిల్లా, కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో గల సర్వే నెంబర్ 106 లోని భూమిపై న్యాయపరమైన వివాదం కొనసాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మొత్తం 6 ఎకరాల 22 గుంటల విస్తీర్ణం కలిగిన ఈ భూమి ప్రస్తుతం వివిధ న్యాయస్థానాలు, అధికారుల పరిధిలో విచారణలో ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఈ భూమికి సంబంధించి వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో (కేసు నం. D1/2763/2018), తెలంగాణ హైకోర్టులో (W.P. 27893/2021) మరియు పరిగి జూనియర్ సివిల్ కోర్టులో (O.S. 194/2025) కేసులు నడుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సదరు భూమిపై ‘లిస్ పెండెన్స్’ (Lis Pendens – Sec 52) నిబంధనలు వర్తిస్తాయని హెచ్చరించారు. అందువల్ల ఈ స్థలాన్ని ఎవరూ కొనడం, అమ్మడం వంటి లావాదేవీలు చేయరాదని, అలాగే అనుమతి లేకుండా అందులోకి ప్రవేశించరాదని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ ప్రవేశం (Criminal Trespass) చేసేవారిపై BNS సెక్షన్ 329 కింద కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.