📄 ePaper
Epaper 2
Thursday, October 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణలక్కినేని గూడెంలో కపాస్ కాంతి పథకంపై రైతులకు అవగాహన

లక్కినేని గూడెంలో కపాస్ కాంతి పథకంపై రైతులకు అవగాహన

📰 Generate e-Paper Clip

*లక్కినేని గూడెంలో కపాస్ కాంతి పథకంపై రైతులకు అవగాహన*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కినేని గూడెం గ్రామంలో కపాస్ కాంతి పథకంలో భాగంగా అధిక సాంద్రత పత్తి (HDPS) సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్, వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్. మహేష్ రైతులకు వివరించారు. అధికారి మల్లేష్ మాట్లాడుతూ – అధిక సాంద్రతలో దగ్గర దగ్గరగా విత్తే పత్తి సాగు వల్ల పంట ఒకేసారి చేతికి వస్తుందని, దీని వల్ల పంట త్వరగా పూర్తయి అదే పొలంలో మరో పంట వేసుకోవచ్చని తెలిపారు. ఎకరానికి 40 వేల మొక్కలు ఉంటాయని, ఇది సాధారణ పద్ధతి కంటే మూడు రెట్లు ఎక్కువ అని చెప్పారు. ప్రస్తుతం పత్తి పెట్టకు గురైందని, రైతులు 2% యూరియా లేదా మల్టీకే స్ప్రే చేయాలని సూచించారు. వచ్చే యాసంగి లో బోర్ల కింద వరి వద్దని, బదులుగా పెసర్లు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో పాశం వెంకట్ రెడ్డి, సంజీవ రెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.