📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriపుచ్చకాయ కోసి వినూత్నంగా లయన్స్ క్లబ్ సభ్యుడు రాఘవేంద్ర ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు

పుచ్చకాయ కోసి వినూత్నంగా లయన్స్ క్లబ్ సభ్యుడు రాఘవేంద్ర ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 12 (ప్రజావాణి):ఘట్‌కేసర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టిపతి రాఘవేంద్ర ప్రసాద్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాఘవేంద్ర ప్రసాద్ పుచ్చకాయ కోసి సభ్యులందరికీ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించాలనే ఉద్దేశంతో పుచ్చకాయ కోసి సభ్యులకు పంపిణీ చేయడం లయన్స్ క్లబ్‌లో ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సభ్యుల మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ లయన్స్ క్లబ్ కార్యదర్శి బచ్చు నగేష్ కుమార్ గుప్తా, చార్టర్డ్ ప్రెసిడెంట్ సారా శ్రీనివాస్ గౌడ్, మారాం లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డి, రామ్మోహన్, అల్లూ కమలాకర్, బోగ శ్రీలక్ష్మి, హిమబిందు, కొన్నే మాధవి, రవిశంకర్, సారా మురళి, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.