పుచ్చకాయ కోసి వినూత్నంగా లయన్స్ క్లబ్ సభ్యుడు రాఘవేంద్ర ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు

ఘట్‌కేసర్, అక్టోబర్ 12 (ప్రజావాణి):ఘట్‌కేసర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టిపతి రాఘవేంద్ర ప్రసాద్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాఘవేంద్ర ప్రసాద్ పుచ్చకాయ కోసి సభ్యులందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించాలనే ఉద్దేశంతో పుచ్చకాయ కోసి సభ్యులకు పంపిణీ చేయడం లయన్స్ క్లబ్‌లో ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సభ్యుల మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో...