📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణస్థానిక ఎన్నికల్లో సీసీ ఫుటేజీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

స్థానిక ఎన్నికల్లో సీసీ ఫుటేజీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

📰 Generate e-Paper Clip

స్థానిక ఎన్నికల్లో సీసీ ఫుటేజీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31
న్యూఢిల్లీ

మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలన్నింటికీ సీసీటీవీ/వీడియోగ్రఫీ కవరేజీ తప్పనిసరి

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు, రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో సీసీటీవీ/వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలని ఆదేశం.

పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనూ సీసీటీవీ/వీడియోగ్రఫీ కవరేజీ ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు.

ఎన్నికల పిటిషన్ల దాఖలుకు నిర్ణయించిన గడువు ముగిసే వరకు వీడియో ఫుటేజీని భద్రపరచాలని ఆదేశం

ఎన్నికల పిటిషన్‌ దాఖలైతే కేసు తుది పరిష్కారం అయ్యే వరకు వీడియో ఫుటేజీని భద్రపరచాల్సిందేన‌న్న సుప్రీం

ఎన్నికల ట్రిబ్యునల్‌ కోరినప్పుడు సంబంధిత వీడియో ఫుటేజీని అందించాలని సుప్రీంకోర్టు ఆదేశం

ఎన్నికల పిటిషన్‌లో భాగస్వాములైన వారికి దరఖాస్తుపై వీడియో ఫుటేజీ అందుబాటులో ఉంచాలని ఆదేశం

రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆదేశం

అభ్యర్థులు నిరాటంకంగా నామినేషన్లు వేసేందుకు పోలీసు బందోబస్తు కల్పించాలని డీజీపీకి ఆదేశం

అన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించేలా అక్టోబర్‌ 27న సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.