📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి శ్రీనివాస్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి శ్రీనివాస్

కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 15(ప్రజావాణి):
వరంగల్‌లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో గురువారం జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యులు శ్రీమతి రేణుకా చౌదరి, వేమ్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. వారితో పాటు ఉమ్మడి మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, జడ్పీ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమావేశంలో. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై, చేపట్టాల్సిన ప్రచార కార్యాచరణపై నాయకులు విస్తృతంగా చర్చించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా పట్టభద్రులు, నిరుద్యోగ యువత అభ్యున్నతి కోసం చేపడుతున్న చర్యలను ప్రతి పట్టభద్రుడి ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో, ఐక్యంగా పనిచేయాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని సమావేశంలో పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.