📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణధాన్య మందిర నిర్మాణానికి భూమి పూజ

ధాన్య మందిర నిర్మాణానికి భూమి పూజ

📰 Generate e-Paper Clip

*ధాన్య మందిర నిర్మాణానికి భూమి పూజ…*

*పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 15*

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి పట్టణంలో ది పోచంపల్లి స్పిరిట్యువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు వారం రోజు నూతన ధ్యాన మందిర పిరమిడ్ నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ , శంకుస్థాపన కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి జీవితంలో ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని పేర్కొన్నారు. ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచడంతో పాటు ఏకా గ్రతను పెంపొందించ డానికి , ఒత్తిడిని తగ్గించు కోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ధ్యానానికి కొంత టైం కేటాయించాలని సూచించారు. పోచంపల్లి లో నూతన ధ్యాన మందిర పిరమిడ్ నిర్మాణం పూర్తయి ప్రజలకు ఉపయోగ పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ది పోచంపల్లి స్పిరిట్యువల్ ట్రస్ట్ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు , వైస్ చైర్మన్ కొయ్యడ రజిని-శ్రీనివాస్, పోచంపల్లి , జూలూరు పిఎసిఎస్ చైర్మన్లు పాక మల్లేష్ యాదవ్ , కళ్లెం రాఘవరెడ్డి , చేనేత సహ కార సంఘ అధ్యక్షులు భారత లవకుమార్ , కౌన్సిలర్లు , కో అప్షన్ సభ్యులు , ట్రస్ట్ ప్రతి నిధులు , నిర్వాహకులు, ఇతర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.