📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనిబంధనలు ఉల్లంఘించి పచ్చని చెట్లు నరికివేత పై కొరడా ఝుళిపించిన అటవీ శాఖ

నిబంధనలు ఉల్లంఘించి పచ్చని చెట్లు నరికివేత పై కొరడా ఝుళిపించిన అటవీ శాఖ

📰 Generate e-Paper Clip

*నిబంధనలు ఉల్లంఘించి పచ్చని చెట్లు నరికివేత పై కొరడా ఝుళిపించిన అటవీ శాఖ*

*అడ్డగోలుగా చెట్లు నరికివేతకు మూల్యం*

*శివాయ పల్లి లో అటవీశాఖ కొరడా*
*అనుమతి లేకుండా పచ్చని చెట్లు నరికితే.. రూ.10,500 రూపాయలు ఫైన్*

*పచ్చని చెట్ల నరికివేత.. సర్పంచ్ భర్తకు భారీ జరిమానా*

*శివాయిపల్లి సర్పంచ్ భర్తకు షాక్ ఇచ్చిన ఫారెస్ట్ అధికారులు*

*పెద్దశంకరంపేట, అక్టోబర్ 6 (ప్రజావాణి ప్రతినిధి బాలరాజు):*

మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట పడింది. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా పచ్చని చెట్లను ఇష్టారాజ్యంగా నరికివేసిన గ్రామ సర్పంచ్ భర్త నరేష్ కు అటవీ శాఖ అధికారులు రూ.10,500 భారీ జరిమానా విధించారు.

గ్రామంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లు విద్యుత్ తీగలకు అడ్డు వస్తున్నాయన్న సాకుతో కొద్దిరోజుల క్రితం కొమ్మలు కొట్టాల్సిందిపోయి ఏకంగా చెట్లను మొదళ్లతో సహా నరికివేశారు. దీనిపై గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో విషయం అటవీ శాఖ దృష్టికి వెళ్లింది.

వెంటనే స్పందించిన అటవీ శాఖ అధికారి హిమచందన విచారణకు ఆదేశించారు. విచారణలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే చెట్లు నరికినట్లు నిర్ధారణ కావడంతో అటవీ చట్టం ప్రకారం సర్పంచ్ భర్త నరేష్ కు రూ.10,500 జరిమానా విధించినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.

పర్యావరణానికి హాని కలిగించే విధంగా, కనీస అనుమతులు లేకుండా పచ్చని చెట్లను నరికితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని అటవీ అధికారి ఈ సందర్భంగా హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.