*నాగర్‌కుంట పాఠశాలలో అక్షయపాత్ర మధ్యాహ్న భోజనం ప్రారంభం*
*విద్యార్థులకు భోజనము వడ్డిస్తున్న సర్పంచ్ పాలమాకుల మల్లయ్య*
రంగారెడ్డి జిల్లా బ్యూరో అక్టోబర్ 1 ప్రజావాణి
షాబాద్ మండల పరిధిలోని నాగర్ కుంట గ్రామంలోని ఎంపీయూపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. పాఠశాలలో అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పాలమాకుల మల్లయ్య ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అక్షయపాత్ర సంస్థ చేపట్టిన కార్యక్రమంపై సర్పంచ్ ఆనందం వ్యక్తం చేస్తూ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులకు పోషక విలువలతో కూడిన నాణ్యమైన భోజనం అందించడం అభినందనీయమన్నారు. అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం అందుబాటులోకి రావడం వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం పెద్దోళ్ల గోపాల్, ఉపాధ్యాయులు విమల, రామకృష్ణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

