📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి

నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి

📰 Generate e-Paper Clip

నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి
ఆయిల్‌ఫెడ్‌ అధికారులకు ఆత్మ చైర్మన్‌ నల్లు సుధాకర్‌రెడ్డి డిమాండ్‌
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 9 ప్రజావాణి:
ఆయిల్‌ఫామ్‌ గెలల కొనుగోలులో తరుగు పేరుతో రైతుల నుంచి టన్నుకు 10 కిలోల చొప్పున కోత విధించడంతో నష్టపోయిన రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని తిరిగి జమ చేయాలని ఆత్మ కమిటీ చైర్మన్‌ నల్లు సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులను నష్టపరిచిన గెలల కొనుగోలు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆయిల్‌ఫెడ్‌ అధికారులను కోరారు.
కురవి మండలం కందికొండలోని ఆయిల్‌ఫామ్‌ గెలల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహబూబాబాద్‌ జిల్లాలో ఆయిల్‌ఫామ్‌ సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో గెలల కొనుగోలు కోసం తొర్రూరు, కందికొండ, కేసముద్రంలో కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే మూడు కేంద్రాలకు ఒకే కాంట్రాక్టర్‌ ఉండటంతో పాటు, గెలలు పచ్చిగా ఉన్నాయనే కారణంతో టన్నుకు 10 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.