*కట్ట మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం…*
*హాజరైన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 15*
పోచంపల్లి పట్టణ పెద్ద చెరువు వద్ద గల కట్ట మైసమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణం అనంతరం గురువారం రోజు నిర్వ హించిన నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం లో భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని , ప్రజలంతా సుఖసంతోషాలతో , ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు , పోచంపల్లి, జూలూరు పీఏసీఎస్ చైర్మన్లు , చేనేత సహకార సంఘం అధ్యక్షులు భారత లవకుమార్ , పలు గ్రామాల సర్పంచులు , కౌన్సిలర్లు , కో-ఆప్షన్ సభ్యులు , ఆలయ కమిటీ నిర్వాహకులు , భక్తులు తదితరులు పాల్గొన్నారు.

