పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించండి
* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట అక్టోబర్ 27 (ప్రజావాణి)
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు తెలుపుతూ ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి,నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతు ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి ప్రతిరోజూ నల్లా ద్వారా సరఫరా చేసే నీటిని అవసరమైనంత మాత్రమే వినియోగించాలి ప్రతి ఇంట్లో నీటిని నిల్వ చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి నీటిని వృథా చేయకుండా మిగిలిన నీటిని సాధ్యమైనంతవరకు తిరిగి ఉపయోగించుకోవాలి అలాగే,ఇళ్లను శుభ్రం చేయడానికి,బట్టలు ఉతకడానికి ఉపయోగించే నీటిని వృథా చేయకుండా, సాధ్యమైన చోట నిల్వ చేసుకుని ఇతర అవసరాలకు వినియోగించాలి ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలి
ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన ఎండలు,అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ,ఎండ తీవ్రత సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలి ప్రభుత్వం సూచనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు..

