డయాలసిస్ సెంటర్ కోసం”వేం”కు వినతి..
ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ డయాలసిస్ బాధితుడు సీనియర్ జర్నలిస్టు పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్ వివిధ గ్రామాల సర్పంచ్ ల తో కలిసి వేం నరేందర్ రెడ్డి కి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రమౌళి గౌడ్ మాట్లాడుతూ మండలంలో వివిధ గ్రామాల నుంచి చాలామంది డయాలసిస్ బాధితులు డయాలసిస్ కోసం జిల్లా కేంద్రం మానుకోట, వరంగల్ హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ప్రయాణ బడలిక వలన డయాలసిస్ బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కుటుంబ సభ్యులను వెంట తీసుకొని వారానికి రెండు మూడు మార్లు వెళ్లాల్సి రావడంతో ఆర్థికంగా కుదేలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డయాలసిస్ సెంటర్ నెల్లికుదురులో ఏర్పాటు చేసినట్లయితే బాధితులకు ఉపశమనం లభిస్తుందన్నారు.
డయాలసిస్ కేంద్రం ఏర్పాటు పరిశీలిస్తాం: వేం
నెల్లికుదురు పి. హెచ్. సి లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తామని రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి అన్నారు.డయాలసిస్ బాధితుల అవస్థల దృష్ట్యా డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. స్థానిక పీహెచ్సీ ని 30 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరిస్తామని తెలిపారు.

