📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బీపీ పరీక్షలకు గంటల తరబడి నిరీక్షణ

జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బీపీ పరీక్షలకు గంటల తరబడి నిరీక్షణ

📰 Generate e-Paper Clip

జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బీపీ పరీక్షలకు గంటల తరబడి నిరీక్షణ!

• ఒకే ఒక్క బీపీ మిషన్‌తో రోగులకు ఇబ్బందులు.. సిబ్బంది నిర్లక్ష్యమా? అధికారుల పర్యవేక్షణ లోపమా?

మన ప్రజావాణి జోగిపేట, అక్టోబర్ 23: జిల్లా ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్య సేవలు అందుతున్నాయా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో బీపీ (రక్తపోటు) పరీక్ష చేయించుకోవడానికి వచ్చే రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.

ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో బీపీ పరీక్షల కోసం ఒకే ఒక్క బీపీ మిషన్ ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికే అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే రోగులు, వృద్ధులు బీపీ పరీక్షల కోసం ఎక్కువసేపు నిలబడాల్సి రావడం ఇబ్బందికరంగా మారింది.

అధికారుల పర్యవేక్షణ ఏదీ?

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందితో పాటు సంబంధిత అధికారులపై కూడా ఉంది. అలాంటప్పుడు బీపీ పరీక్షల కోసం అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడానికి కారణమేంటి? ఆసుపత్రిలో రోగుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సిబ్బంది నిర్లక్ష్యమా? అధికారుల పర్యవేక్షణ లోపమా? అన్నది ఉన్నతాధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, అవసరమైన బీపీ మిషన్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రోగులు గంటల తరబడి వేచి ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.